PERIGINADU CHOODARO PEDDA


Audio link :G.BalaKrishnaPrasad Archive link : పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు ||   రక్కసుల పాలికి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు   దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు ||   లలిమీరిన యట్టి లావుల భీముడు   బలు కపికుల సార్వభౌముడు   నెలకొన్న లంకా నిర్థూమధాముడు   తలపున శ్రీరాము నాత్మారాముడు || దేవకార్యముల దిక్కువరేణ్యుడు   భావింపగల తపః ఫల పుణ్యుడు శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు   సావధానుడు సర్వశరణ్యుడు || in english:   periginADu cUDarO pedda hanumaMtuDu   paragi nAnA vidyala balavaMtuDu ||   rakkasula pAliki raNaraMga SUruDu vekkasapu EkAMga vIruDu   dikkulaku saMjIvi techchina dhIruDu   akkajamainaTTi AkAruDu ||   lalimIrina yaTTi lAvula bhImuDu   balu kapikula sArwabhaumuDu   nelakonna laMkA nirthUmadhAmuDu   talapuna SrIrAmu nAtmArAmuDu ||   dEvakAryamula dikkuvarENyuDu   bhAviMpagala tapa@h phala puNyuDu   SrIvEMkaTESwara sEvAgragaNyuDu   sAvadhAnuDu sarwaSaraNyuDu || Meaning by Dr.Patanjali in Sakshi magazine.