
ADE CHOODARAYYA PEDDA
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య ఉదయాస్తశైలములు ఒకజంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ్య || దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తె మెండగు దిక్కుల నిండా మేను వెంచెను గుండు గూడ రాకాసుల కొట్టగ చేతుల చాచె అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా || దిక్కులు పిక్కటిల్ల్లగ దేహరోమములు పెంచె పక్కన లోకములకు ప్రాణమై నిల్చె ఇక్కడా శ్రీవెంకటేశు హితవరి బంటాయ మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య || ade chUDarayya pedda hanumaMtuni gudigoni dEVatalu koniyADErayya udayAstaSailamulu okajaMgagA chAche adivO dhRvamaMDala maMde Sirasu chadive sUryuni veMTa sAre mogamu drippuchu eduTa Itani mahima yEmani cheppEmayya || daMDigA brahmAMDamu dAka tOkamIdikette meMDagu dikkula niMDA mEnu veMchenu guMDu gUDa rAkAsula koTTaga chEtula chAche aMDa Itani pratApa marudarudayyA || dikkulu pikkaTilllaga dEharOmamulu peMche pakkana lOkamulaku prANamai nilche ikkaDA SrIveMkaTESu hitavari baMTAya mikkili Itani lAvu mElu mElayya ||
Chapters
ADE CHOODARAYYA PEDDA | 6:08 |