
EETHADU O RAMUDU
Sujatha
ఈతడువో రాముడు ఏకాంగవీరుడు ఏతలజూచినా తానె ఇరవుకొన్నవాడు చిరుత ప్రాయమునాడు శివునివిల్లువిరచి మెరసి సీతను పెండ్లాడి మించినవాడు తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన జరసి తానొక్కడే చదిపిన వాడు ఓడకవిల్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున ఏడు తాళ్ళు ధరను కూలవేసినవాడు జాడాగా కొండలచేత జలనిధిఁ గట్టించి వేడుకతో లంకమీద విడిసిన వాడు రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు శ్రీవేంకటాద్రిమీదఁ జేరి మాల్యవంతమున వేవేలు చందములను వెలసినవాడు ItaDuvO rAmuDu EkAMgavIruDu EtalajUchinA tAne iravukonnavADu chiruta prAyamunADu Sivunivilluvirachi merasi sItanu peMDlADi miMchinavADu tari padunAlugu vEla dAnavula nimishAna jarasi tAnokkaDE chadipina vADu ODakavillekkupeTTi UrakE okkammuna EDu tALLu dharanu kUlavEsinavADu jADAgA koMDalachEta jalanidhi@M gaTTiMchi vEDukatO laMkamIda viDisina vADu rAvaNa kuMbhakarNAdi rAkAsula parimArchi Ivala ayOdhyApaTnamElina vADu SrIvEMkaTAdrimIda@M jEri mAlyavaMtamuna vEvElu chaMdamulanu velasinavADu
Chapters
ItadiOrAmuDu | 5:10 |