
Daivam A N Ich Etid E M Adharmapu Nyamu
Sujatha
దైవమా నీ చేతిదే మాధర్మపుణ్యము పూవు వంటి కడు లేత బుధ్ధి వారము యేమిటి వారము నేము యిదివో మా కర్మ మెంత భూమి నీవు పుట్టించగఁ బుట్టితిమి నేమముతో నడచేటి నేరుపేది మావల్ల దీముతో మోచిన తోలు దేహులము యెక్కడ మాకిక గతి యెరిగే దెన్నడు నేము చిక్కినట్టి నీ చేతిలో జీవులము తక్కక నీ మాయలెల్లాఁ దాటగలమా మేము మొక్కలపుటజ్ఞానపు ముగ్ధలము యేది తుద మొదలు మాకిక నిందులో నీవే ఆదిమూర్తి నీకు శరణాగతులము యీదెస శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె నీదయ గలుగగాను నీ వారము daivamA nI chEtidE mAdharmapuNyamu pUvu vaMTi kaDu lEta budhdhi vAramu yEmiTi vAramu nEmu yidivO mA karma meMta bhUmi nIvu puTTiMchaga@M buTTitimi nEmamutO naDachETi nErupEdi mAvalla dImutO mOchina tOlu dEhulamu yekkaDa mAkika gati yerigE dennaDu nEmu chikkinaTTi nI chEtilO jIvulamu takkaka nI mAyalellA@M dATagalamA mEmu mokkalapuTaj~nAnapu mugdhalamu yEdi tuda modalu mAkika niMdulO nIvE AdimUrti nIku SaraNAgatulamu yIdesa SrIvEMkaTESa yElitivi nannu niTTe nIdaya galugagAnu nI vAramu
Chapters
daivamA nIchEtidE mAdharmapuNyamu-03249 | 6:37 |